మరోసారి స్క్రీన్ మీద సందడి చేయనున్నా ప్రభాస్ – అనుష్క

 టాలీవుడ్  స్టార్ ప్రభాస్ కటౌట్ గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ ప్రభాస్ కోసమే రాసిన డైలాగ్ మాదిరిగా ఆయన కటౌట్‌ను చూస్తే కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే. అందుకే, ఆయన పక్కన కూడా అదే రేంజ్ కటౌట్ ఉన్న హీరోయిన్స్ ఉంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటుంటారు. ఇక మన టాలీవుడ్‌లో ప్రభాస్‌కు సూటయ్యే కటౌట్. అందరూ సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపించే హీరోయిన్ అనుష్క శెట్టి. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ వచ్చాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాయి. ఇక ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచి ఫ్రెండ్స్ కూడా. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్  అనుష్కలకు పెళ్లి కూడా చేసేశారు.

వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు. మరోసారి అభిమానులందరూ ఆశించినట్టుగా ప్రభాస్ – అనుష్క కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నారట. ఈ మూవీ మారుతి స్టయిల్ ఆఫ్ కామెడితో ఉంటుందని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిబోతుండగా, ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో ఒకరు అనుష్క శెట్టి అని..ఆమెతో ఇప్పటికే మారుతీ చర్చలు కూడా జరిపాడని అంటున్నారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ పలువురు యంగ్ బ్యూటీస్ పేర్లను పరిశీలిస్తున్నారట. ప్రభాస్-అనుష్కల కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆశపడుతున్నారు.