నాటుసారా స్థావరాలపై దాడులు.

రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామం సమీపంలో ఉన్న తెలుగు గంగ కాలువ దగ్గర ఉన్న నాటుసారా బట్టి పై పోలీసులు దాడులు జరిపి 3,000 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం చేశారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజ కుల్లాయప్ప మాట్లాడారు. కోటకొండ గ్రామ సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న తెలుగు గంగ కాలవ దగ్గర నాటుసారా బట్టి ఉన్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది తో దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా కోటకొండ గ్రామానికి చెందిన బాలరాజు, మహాదేవపురం గ్రామానికి చెందిన ఎరుకల సుబ్బయ్య చెందిన నాటుసారా బట్టి ని గుర్తించి 16 డ్రమ్ము లో ఉన్న నాటు సారా బెల్లం ఊట పరికరాలను ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .