సోషల్ మీడియాలో ఆడియోని వైరల్ చేసిన నలుగురు వ్యక్తులపై సుమోటో గా కేసు

సోషల్ మీడియాలో ఆడియోని వైరల్ చేసిన నలుగురు వ్యక్తులపై సుమోటో గా కేసు నమోదు చేసిన అమలాపురం డిఎస్పి వై.మాధవరెడ్డి.

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగే విదంగా వ్యాఖ్యలు చేసుకుని వాటిని సామజిక మాధ్యమాల్లో ప్రచారం చెయ్యడం జరిగింది దీనిని పరిగణలోకి తీసుకొని అమలాపురం డిఎస్పి వై. మాధవరెడ్డి సుమోటోగా ఈ కేసు నమోదు చేసి ఆడియోలు సోషల్ మీడియా హల్చల్ చేసిన నలుగురు వ్యక్తులను గుర్తించారు.

అమలాపురం సబ్ డివిజన్లో నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *