వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు..

కృష్ణాజిల్లా నందిగామ: నందిగామ పట్టణ గాంధీ సెంటర్లో వాహనాల ముమ్మర తనిఖీలు మంగళవారం సిఐ. కనకారావు ఆధ్వర్యంలో ఎస్సై తాతాచార్యులు, పోలీస్ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కనకారావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వాహనాల అనుమతులు పత్రాలు, నెంబర్ ప్లేట్, లైసెన్స్ లేకుండా పట్టణంలోని విచ్చలవిడిగా సంచరిస్తున్న 20 కి పైగా వాహనాల పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తరలించామని తెలిపారు. అతి వేగంగా వాహనాలు నడుపుతూ హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ భారీ సౌండ్ (బుల్లెట్ మఫ్లర్ ) ద్విచక్ర వాహనాలు తో అనుమతి ప్రతాలు లేని వాహనాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు యువతీ యువకులకు వాహనాలు ఇచ్చి బయట తిరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు పై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.