లద్దాఖ్​ సమీపంలో మళ్లీ చైనా సైన్యం కదలికలు

సంవత్సరం పాటు సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం మళ్లీ తన కార్యకలాపాల్ని తూర్పు లద్దాఖ్​ సమీపంలో చేపడుతోంది. కరోనా తీవ్రత ఉన్నా.. చైనా ఆర్మీ కదలికల్ని భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. ప్రతి వేసవికాలంలో కార్యకలాపాల్ని చేయడానికి చైనా లిబరేషన్​ ఆర్మీ ఎన్నో ఏళ్ల నుంచి తూర్పులద్దాఖ్​ సరిహద్దు ప్రాంతాలకు వస్తోంది. గత వేసవిలోనూ ఇలాగే వచ్చి. తూర్పులద్దాఖ్​లో ఘర్షణలకు తెరలేపింది. అని విశ్వసనీయ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

చైనా బలగాలు తమ భూభాగంలో 100 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. పాంగాంగ్​ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాల భద్రతా దళాల ఉపసంహరణ ఒప్పందంలో అపరిష్కృతంగా మిగిలి ఉన్న ఘర్షణ ప్రాంతాలు. హాట్​ స్ప్రింగ్స్​, గోగ్రా హైట్స్​పై చర్చిస్తున్న సమయంలో.. ఈ పరిమాణాలు కీలకంగా మారాయి. ​ మన దేశం కూడా ఇండో-టిబెటిన్​ సరిహద్దు పోలీసులు సహా భారత వాయుసేన, సైన్యాన్ని తూర్పులద్దాఖ్​ సెక్టార్​కు సమీపంలో మోహరించింది. చైనా ఆర్మీ విన్యాసాల కోసం తూర్పులద్దాఖ్​కు సమీపంలోకి వచ్చిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం అక్కడికి వెెళ్లింది. ఫలితంగా అప్పటినుంచి సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే.. చైనా సైన్యం తన సొంత ప్రదేశాలకు తిరిగి వెళ్తుందని అనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. అంతటితో ఆగకుండా చైనా సైన్యం.. సరిహద్దులకు సమీపంలోని తమ ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తోంది. భారత సైన్యం కూడా దీటుగా గత సంవత్సరం నుంచి అక్కడ సైన్యాన్ని దింపుతోంది. గతేడాది నుంచి చైనా, భారత్​లు తమ సైన్యాల్ని అక్కడ మోహరిస్తున్నాయి.

ఈ బలగాల తరలింపుతో షుగర్​ సెక్టార్​, సెంట్రల్​ సెక్టార్​, ఈశాన్య సెక్టార్​లు సైనిక బలగాలతో పటిష్ఠంగా ఉన్నాయి. పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరం వెంబడి వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా.. ఫింగర్​ ప్రాంతం నుంచి ఇరుదేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేయగలిగాయి. అయితే ఇతర ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు మరోసారి చర్చలు జరపాల్సి ఉంది. గోగ్రా, హాట్​ స్ప్రింగ్స్​, దెప్సాంగ్​ ప్రాంతాల నుంచి చైనా బలగాలు మరలి వెళ్లాలని భారత్​ గట్టిగా వాదిస్తోంది. అయితే ప్రతిష్టంభన నెలకొన్నప్పటి నుంచి చైనా బలగాలు.. హోతన్​, గరీ గున్సా, కష్గర్​ ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగల హెచ్​ క్యూ-9 లాంటి వాయు క్షిపణుల్ని మోహరించాయి. చైనా సైనిక కదలికల్ని గమనిస్తూనే భారత్ కూడా రఫేల్​ యుద్ధవిమానాలు, తదితర నౌకల్ని సరిహద్దుల్లో మోహరిస్తోంది