విమోచ‌న దినం నిర్వ‌హించాల‌ని హైకోర్టులో పిల్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌ల‌య్యింది. న్యాయవాది జనార్దన్ గౌడ్ ఈ పిల్ దాఖలు చేశారు. సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని పిటిషనర్ కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురువేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అన్న ఆస‌క్తి నెల‌కొంది.