ఈనెల 11న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చమురు ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు.

కరోనా కష్టకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోపక్క ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల ఎదుట నిరసన చేపడుతారని పార్టీ పేర్కొంది. జూన్‌లో బుధవారం నాటికి చమురు కంపెనీలు ఐదు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు చమురు ధరలు 22వ సార్లు పెరిగాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేవ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు లడాఖ్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.100 దాటింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెట్రోల్‌ రూ.106.39, డీజిల్‌ రూ.99.24కు చేరింది.