సామాన్యుడిపై మళ్ళీ పెట్రో మంట

కరోనా విపత్కర పరిస్థితుల్లో అధికధరలతో సామాన్యుడు వెన్నుపై భారం పడుతున్న వేళ.. వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటం వలన మరింత భారం పడుతుంది. ఇప్పటికే పలుమార్లు ధరలు పెంచుకుంటూ వస్తున్న చమురు కంపెనీలు. తాజాగా ఈరోజు పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్‌పై 34 పైసలు పెంచాయి. తాజా పెంపుతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.95.97, డీజిల్ రూ.90.43‌ చేరాయి. ఇప్పటి వరకు ఈ నెలలో ఎనిమిది సార్లు పెట్రోల్‌ రేట్లు పెరిగాయి.