సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తంగిరాల సౌమ్య

కృష్ణాజిల్లా నందిగామ: ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య సూచించారు. వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో సోమవారం ఉదయం స్థానిక తెదేపా నేతలతో కలిసి పర్యటించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏంగళదాస్ లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూసీజనల్ వ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో వైరల్ ఫీవర్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకునే వారేరని ప్రశ్నించారు.ఎంతో గొప్పలు చేప్పుకునే వాలంటీర్ వ్యవస్థ ఏమి చేస్తుందన్నారు. ప్రతి 50 కుటుంబాల కు వాలంటీర్ ను నియమించారు కాని ఎక్కడ పనిచేస్తున్నారని సౌమ్య ప్రశ్నించారు.గ్రామాల్లో వైరల్ ఫీవర్ వలన ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారానే సమాచారం మీ దగ్గర ఉందా అని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో ఎ యన్ యమ్ లు ఎమీ చేస్తున్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారా అని అడిగారు.ప్రతి గ్రామాన వైద్య అధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేయాలని, అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టి ,ప్రతి గ్రామాన శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.