రాహుల్ గాంధీ పై ప్రశంసల జల్లు కురిపించిన పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ

 పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  పై ప్రశంసల జల్లు కురిపించా రు. భారత్ జోడో యాత్ర  ముగింపు సభలో సోమవారం ఆమె మాట్లాడుతూ, గాడ్సే భావజాలం లాక్కున్నదాన్ని పునరుద్ధరించాలని గాంధీని కోరారు.  జమ్మూ-కశ్మీరులో ఓ ఆశా కిరణాన్ని చూస్తున్నానని గాంధీజీ గతంలో అన్నారు. నేడు, దేశం రాహుల్ గాంధీలో ఓ ఆశా కరిణాన్ని చూస్తోంది అని మెహబూబా ముఫ్తీ చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా  మాట్లాడుతూ, దేశంలోని పశ్చిమం నుంచి తూర్పునకు మరొక యాత్రను చేపట్టాలని రాహుల్ గాంధీని కోరారు. ఆ యాత్రలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. భారత్ జోడో యాత్ర విజయవంతమైందన్నారు. బీజేపీని ఇష్టపడేవారితోపాటు సోదరభావా న్ని ఇష్టపడేవారు కూడా ఈ దేశంలో ఉన్నారని ఈ యాత్ర వల్ల స్పష్టమైందని తెలిపారు. ఆర్ఎస్‌పీ నేత ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు. విభజన శక్తులతో పోరాడగలిగే నేతను తానేనని రాహుల్ రుజువు చేసుకున్నారని తెలిపారు.