చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్

మరికాసేపట్లో సింగరేణి బాధిత కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. సైదాబాద్‌ సింగ‌రేణి కాల‌నీలో ఇటీవ‌ల 6 ఏళ్ల చిన్నారి చైత్ర ను ఓ యువకుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేయ‌డంతోపాటు హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై యావ‌త్ ప్రజానీకం భ‌గ్గుమంటోంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాలు, మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.