పంట కాలువల్లో పూడికలు తీయించిన సౌమ్య.

కృష్ణాజిల్లా నందిగామ: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట పొలాల్లో వరద నీరు చేరడం వల్ల పూర్తిగా పంట నీట మునిగాయి వాటిని పరిశీలించడానికి వచ్చిన రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబుకురైతులు పంట కాలువలో పూడిక తీత పనులు చేస్తే నీరు మొత్తం బయటకు వెళ్లి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చని తెలపడంతో వెంటనే మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తమ సొంత నిధులు వెచ్చించి జెసిబి ద్వారా పంట కాలువలో పూడిక తీత ప్రారంభించి నీటిని పొలాల్లో నుండి బయటికి తరలించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, తెలుగు రైతు అధ్యక్షుడు మాగంటి నరసింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాగంటి పుల్లారావు,భాస్కర్రావు పాల్గొన్నారు.