ఇంగ్లాండ్ పర్యటనకు పాక్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఇంగ్లండ్‌తో టెస్టు, టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. జులైలో ఈ సిరీస్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు, కానీ ఆటగాళ్లపై ఎటువంటి బలవంతం ఉండబోదని ఇరు దేశాల బోర్డులు స్పష్టం చేశాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం, ఇంగ్లండ్‌ పర్యటన విషయంలో ఓ అంగీకారానికి వచ్చామని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జులైలో పాక్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుందని పీసీబీ సీఈవో వసీం ఖాన్ తెలిపారు.

మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. మూడు టెస్టుల్లో రెండింటిని మాంచెస్టర్, సౌతాంప్టన్‌లలో నిర్వహించాలని భావిస్తుండగా, మూడో వేదికపై ఇంకా స్పష్టత రాలేదు. ఆటగాళ్ల రక్షణకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చూసుకుంటుందని వసీంఖాన్ తెలిపారు.