విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలి

కృష్ణాజిల్లా నందిగామ మండలం పెద్దవరం గ్రామం లో ఎస్సీ కాలనీలో చర్చకి ప్రార్థన కు వెళ్లిన యోహన్ అనే వ్యక్తికి ఫోన్ రావడంతో చర్చ పైకి వెళ్లి మాట్లాడుతుండగా చర్చికి ఆనుకొని ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడకు అక్కడే మృతి. గత నాలుగు సంవత్సరాల నుండి చర్చికి అనుకుని ప్రమాదకరంగా విద్యుత్ తీగలు అడ్డాగా ఉన్నాయని విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యోహాన్ మృతికి విద్యుత్ అధికారులే కారణమని ఇప్పటికైనా చర్చికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు