రేపల్లె -NRI జనసేన అభిమానులు ముందుకు వచ్చారు

రేపల్లె – కరోనా వైరస్ నివారణ నేపధ్యం లో భారతదేశం అంత 21 రోజులు లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 8 రోజులు పూర్తి అయ్యాయి. ఈ లాక్ డౌన్ వల్ల సాధారణ ప్రజానీకం తో పాటుగా తీవ్రంగా రేపల్లె పట్టణం లోఅనాధలు, యాచకులు, నిరుపేద కుటుంబాలు, రోజు వారి కూలీ లేకపోవడం వలన ఇంకెంతోమంది కనీస ఆహారానికి కూడా నోచుకోవడం లేదు. పట్టణం లో అనాధలని/ముష్టి వారిని ఇతరత్రా ఇల్లు లేని వాళ్ళ ని అందర్నీ కలిపి ఒక షెల్టర్ లో పెట్టారు. వీరి పరిస్థితి ని విని, చూసి  NRI జనసేన అభిమానులు వీరిని ఆదుకోవటానికి  తమ విరాళాలతో  ముందుకు వచ్చారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని జనసేన కార్యకర్తల సహాయ సహకారాలతో వీళ్ళ కోసం భోజనం తయారు చేపించి దాదాపు 150 మందికి ఈ రోజు అందించటం జరిగింది. ఒక్క రోజు తో చేతులు దులుపుకోవడం కాకుండా, లాక్ డౌన్ ఎత్తివేసేవరకు (అనగా ఏప్రిల్ 15 వరకు ప్రతి రోజు) ఈ కార్యక్రమాన్నివీలయినంతవరకు  కొనసాగించాలని NRI JSP నిశ్చయించింది.  ఈ కార్యక్రమానికి పోలీస్, మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారం మరువలేనిది. ఆహారాన్ని శుచి శుభ్రత లతో తయారుచెయ్యడమే కాకుండా తగిన జాగ్రత్తలతో అందరకి అందిస్తున్న రేపల్లె జనసేన కార్యకర్తలని పట్టణ అధికారులు అభినందించారు. రేపల్లె పట్టణం లో గత వారం గా నిర్విరామంగా సేవలు అందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు కూడా ఈ భోజన సౌకర్యాన్ని అందించాల్సింది గా నిర్వాహకులని కోరారు. భోజనం అందుకున్న ప్రతి ఒక్కరు ఈ అన్నదాన సంతర్పణ కి విరాళం అందించిన ప్రతి ఒక్కరికి తమ నమస్కారాలతో కృతజ్ఞతలుతెలిపారు. ఈ ఆపత్కాలంలో ఎవరి దారి వారు చూసుకోకుండా మాతృ భూమి లో ని భోజనం కూడా కరువయ్యిన పేదల పట్ల వారు చూపించిన ఔదార్యానికి కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. రేపల్లె జనసేన నియోజకవర్గ కార్యకర్తలు భాషా, సాయి గోపి,  సాయిరాం, కృష్ణ , సాయి , మున్నా తదితరులు దామెర్ల ధర్మతేజ నాయకత్వం లో ఈ యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు. సామాజిక కార్యక్రమాలు చెయ్యటానికి జనసేన ఎప్పుడు ముందు వరసలో ఉంటుంది అని ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఇతోధికంగా ధన సహాయం చేస్తున్న ప్రతి NRI JSP సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు.