తెలంగాణలో పలు చోట్ల NIA సోదాలు.

5 జిల్లాల్లో 9 ప్రదేశాల్లో NIA సోదాలు, దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో తనిఖీలు నిర్వహించినట్లు ఎన్.ఐ.ఏ వెల్లడించింది.
మహబూబ్‌నగర్‌, వరంగల్‌, జనగామ, భద్రాద్రి, మేడ్చల్‌ జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముత్తు నాగరాజు, వి.సతీష్‌ నివాసాల్లో సోదాలు చేశారు. మేడ్చల్‌లోని కొమ్మరాజు కనకయ్య ఇంట్లో, భద్రాద్రి జిల్లాలోని గుంజి విక్రమ్‌, త్రినాథరావు ఇళ్లలో, జనగామలో సూరసారయ్య, వరంగల్‌లో వేలుపు స్వామి ఇళ్లలో తనిఖీలు చేశారు.ఈ దాడుల్లో నిందితుల నుండి 400 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లతో పాటు, 500 నాన్‌ ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 400 జిలిటెన్ స్టిక్స్‌,549 మీటర్ల ఫ్యూజ్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నేత హీద్మాకు రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు NIA వెల్లడించింది. ఐఈడీ, గ్రనేడ్‌ లాంచర్ల తయారీకి అవసరైన సామగ్రిని గుర్తించామని, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్.ఐ.ఏ వెల్లడించింది.