డెల్టాక్రాన్’- ఒమిక్రాన్, డెల్టా కలయికతో కరోనా కొత్త వేరియంట్

 సైప్రస్​లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో ఈ వేరియంట్ ​ఏర్పడింది. శాస్త్రీయ పేరును ఇంకా ఖరారు చేయని ఈ కొత్త వేరియంట్​ను ‘డెల్టాక్రాన్’గా పరిగణిస్తున్నారు. అయితే, ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. సైప్రస్​లో సేకరించిన 25 నమూనాల్లో పది ఒమిక్రాన్ మ్యుటేషన్లు కనిపించినట్లు స్థానిక వార్తా కథనాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల నుంచి 11 నమూనాలు, సాధారణ పౌరుల నుంచి 14 నమూనాలు పరీక్షించినట్లు తెలిపాయి . ఆస్పత్రిలో చేరిన బాధితుల నమూనాల్లో మ్యుటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని సైప్రస్ విశ్వవిద్యాలయ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్ట్రికిస్ తెలిపారు. అయితే, కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రి చేరికలు పెరుగుతాయని చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పారు. కొత్త వేరియంట్​లో డెల్టా జన్యు నేపథ్యం, ఒమిక్రాన్ మ్యుటేషన్లు ఉన్నాయని వివరించారు.  సైప్రస్ వైద్య శాఖ మంత్రి మిషలిస్ హజిపండెలాస్ సైతం కొత్త వేరియంట్​పై భయం అక్కర్లేదని అన్నారు. కొత్త వేరియంట్​ను గుర్తించిన శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవిజ్ఞానంతో సైప్రస్ శాస్త్రవేత్తలు వేరియంట్​ను గుర్తించగలగడం తమకు గర్వకారణమని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, స్టేడియాలకు వచ్చేవారు వ్యాక్సినేషన్ కార్డు తప్పనిసరిగా చూపించాలనే నిబంధన తీసుకొచ్చింది