కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం

 కామన్‌వెల్త్ గేమ్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్​నెస్​ కారణంగా నీరజ్​ పోటీల్లో పాల్గొనడం లేదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రకటించింది….  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తా చాటాడు నీరజ్​. పోటీల సమయంలో అతడికి గాయమైనట్లు ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా చెప్పారు. అతడికి ఒక నెల విశ్రాంతి అవసరమని నిపుణులు పేర్కొన్నారు.