బాలీవుడ్​​లో ఎంట్రీ ఇవ్వనున్న నయనతార.

దక్షిణాది నుంచి ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్​లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొంతమంది ఇంకా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే లేడీ సూపర్​ స్టార్​ నయనతార మాత్రం ఇంత వరకు హిందీలో ఎంట్రీ ఇవ్వలేదు. ఆమె ఎప్పుడెప్పుడు బాలీవుడ్​లో అడుగుపెడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్.. త్వరలోనే బాలీవుడ్​ ఎంట్రీకి సిద్ధమవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. స్టార్​ హీరో షారుక్​ ఖాన్(Sharukh Khan)​ త్వరలోనే కోలీవుడ్​ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో నయన్ నటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.