హోం క్వారంటైన్ లో నవాజుద్దీన్ సిద్దిఖీ, అతని కుటుంబ సభ్యులు..!

బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీని, అతని కుటుంబ సభ్యులను యూపీ ముజఫర్ నగర్ జిల్లా, బుధానాలోని తన ఇంట్లో 14 రోజుల పాటు అధికారులు హోం క్వారంటైన్ చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ట్రావెల్ పాస్ తీసుకుని, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ నెల 15న బుధానాలోని తన సొంతింటికి చేరుకున్నాడు. అయితే, నవాజుద్దీన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. దాంతో అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి మే 25 వరకు ఇంట్లోంచి బయటికి రాకూడదని సూచించారు. హెల్త్ ఆఫీసర్లు నవాజుద్దీన్ ఇంటికి వెళ్లి 14 రోజుల హోం క్వారంటైన్ ఆదేశించారని బుధానా పోలీసు సర్కిల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కుశాల్‌పాల్ సింగ్ తెలిపారు.