పేదల అభ్యున్నతికే నవరత్నాలు- ఎమ్మెల్యే అన్నా
పేదల అభ్యున్నతికే ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు అన్నారు. శనివారం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని అర్బన్ కాలనీ -7 సచివాలయం పరిధిలోని మిట్టమీది పల్లి, చట్రేడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన 75 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నా ఆయా గ్రామాల్లోని ప్రతి గడప – గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ కుల, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలును ముఖ్య మంత్రి వై,ఎస్, జగన్ మోహన్ రెడ్డి గారు అందచేస్తున్నారన్నారు. మరోసారి జగనన్న ను ముఖ్య మంత్రి గా చూసుకోవాలంటే మీ ఆశీర్వాదాలు అందించాలన్నారు. నవరత్నాల పథకాలతో పాటు మరిన్ని పథకాలను అమ్మ ఒడి, వైఎస్సార్ పింఛన్ కానుక, చేయుత, ఆసరా, ఆరోగ్యశ్రీ, వాహనమిత్ర, విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు పేదలందరికి ఇల్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ముందుగా ఎమ్మెల్యే అన్నా ను పలువురు నాయకులు, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపీ ముఖ్య నేతలు,నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.