ఘనంగా జాతీయ భద్రత దినోత్సవం

గుడివాడ: ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జాతీయ భద్రత దినోత్సవాన్ని శుక్రవారం నెహ్రూచౌక్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు దండమూడి సీతారామస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ఐ ఎం హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు మరియు వాహనదారులకు కు సేఫ్టీ హెల్త్ మరియు పరిసరాల గురించి తెలియజేశారు. ముఖ్యముగా భద్రత కోసం చిన్న పిల్లలకు పెద్దలు వాహనములు ఇవ్వరాదని లైసెన్స్ లేకుండా తిరుగ రాదని మాస్కులు ధరించాలని హెల్మెట్లు ధరించాలని అవగాహన కల్పించారు అధ్యక్షుడు దండమూడి సీతారామస్వామి మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు సహకరించాలని సామాజిక స్పృహ కలిగి ఉండాలని వివరించారు ఆ తరువాత ఈశ్వర్ వెంకటేశ్వరరావు తిరుపతయ్య తదితరులు భద్రత మీద ప్రసంగించారు వాహనములకు స్టిక్కరింగ్ వేసి వాహనదారులకు గులాబీ పూలను అందించారు ట్రాఫిక్ ఎస్ఐ హనుమంతరావు గారిని శాలువాతో సత్కరించి పూల బోకే తో జ్ఞాపికతో ఘనముగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ వెంకటేశ్వరరావు తిరుపతయ్య అధ్య ప్రసాదు చింతా దుర్గ రామకృష్ణ మెరుగుమాల బ్రహ్మయ్య పి సత్యనారాయణ బొప్పన కుటుంబరావు ఆలీ గారు కోన రామారావు గారు ఆది నారాయణ రావు గారు పోలీసు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.