ఒక్క పాటతోనే 7.5 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించిన నాని

న్యాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు “దసరా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొట్టమొదటి సింగల్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. “ధూమ్ ధామ్ దోస్తాన్” అని సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.7.5 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ను సంపాదించిన ఈ పాట వీడియో ఇప్పుడు యూట్యూబ్ లోనే టాప్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది.    కేవలం ఒకే ఒక్క పాటతోనే ఇంత సంచలనం సృష్టించిన ఈ సినిమా ను కొనుక్కునేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు బాగానే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో విడుదల కాబోతోంది.