నాలా ఆక్రమణలు వల్ల ప్రతి ఏటా వరద నీటి సమస్య ఏర్పడుతుంది

నాలా ఆక్రమణలు వల్ల ప్రతి ఏటా వరద నీటి సమస్య ఏర్పడుతుంది అని , వీటి ఆక్రమణలు తొలగింపునకు స్థానిక ప్రజల సహకరిస్తే వాటిని కూల్చివేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గారు ఎస్ పి నగర్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి నాలా పై ఉన్న ఇంటిని Ghmc అధికారుల తో కలిసి కూల్చివేయడం జరిగింది ఇంటి ఓనర్లు కూడా సహాకారణం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గవర్నమెంట్ నుండి వచ్చే నష్టపరిహారం కాకుండా తన సొంతంగా డబ్బులు ఇస్తానని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు మిగిలిన వారూ కూడా సహరిస్తే ముందుముందు ఇలాంటి ప్రాబ్లమ్ రాదు కనుక అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగదీష్ గౌడ్,డిసి దశరథ, ఎస్ ఈ అనిల్ రాజ్,ఏసీపీ ఖాలీలుద్దీన్, టిపిఓ శ్రీదేవి, డీఈ లౌక్య,ఏఈ దివ్యజ్యోతి,నాయకులు ప్రేమ్ కుమార్, పరశురాం రెడ్డి, gnv సతీష్ కుమార్, రాముయదవ్, గుండా నిరంజన్, మోహన్ రెడ్డి, ఉపేందర్, సంతోష్ రాందాస్, మోహన్ యాదవ్, పులపల్లి జగదీష్ యాదవ్, బాగ్యానంద్ రావు, మోహన్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.