నాడు – నేడు నూతన భవనాలు నిర్మాణ పనులను పరిశీ లించిన స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట

ఎమ్మిగనూరు : పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాధమిక పాఠశాలలో (గర్ల్స్ హై స్కూల్) ఆకస్మిక తనిఖీ చేస్తు నాడు- నేడు కింద రూ. 2.50 కోట్ల రూపాయలతో 20 తరగతుల నూతన భవనాలు నిర్మాణ పనులను పరిశీ లించిన  స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డ ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యకు పెద్దపీట వేశారని. కావున ప్రతి విద్యార్థిని విద్యార్థి చదువు కోవడానికి ప్రభుత్వ పాఠశాలలను నాడు- నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించి. అక్కడి కంటే ఉన్నతమైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది అన్నారు. ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు పారదర్శకంగా ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా నేరుగా అకౌంట్లోకి జమచేసున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్ గారికె దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఎం.క్రిష్ణా, డిఈఈ మనోహర్ రెడ్డి, ఏఇ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, ప్రధాన కార్యదర్శి యూకె. వీరేంద్ర, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, హెచ్ఎం. గౌసియా బేగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.