సీఎం స్టాలిన్ సేవానీతి మన జగన్ లో లేదు.

తుఫాన్ బాధితులకు ఎన్నారైలు , ప్రజాసంఘాలతో పాటు జనసైనికులు నిత్యావసరాలు అందించి ఆదుకున్నారు. వరదలు ముంచెత్తిన జిల్లాలలో తిరిగాం , బాధితుల కష్టాలను చూసాం , వారికి అండగా నిలిచి, ప్రభుత్వాన్ని న్యాయమైన సాయం చేయమని డిమాండ్ చేస్తాo. మా జనసేనాని పవన్ వైసిపి స్పందించకపోతే , ప్రకృతి విలయతాండవం లో నష్టపోయిన బాధితుల కోసం పోరాడుతారు. కక్షలతో అసెంబ్లీ లో మాజీ సీఎం చంద్రబాబుకు సమాన స్థానం కల్పించలేకపోయారు. అమరావతి రైతుల పాదయాత్రలో జనసేన సైతం మద్దతుగా పాల్గొంటుంది. తమ జనసేనాని రాష్ట్రంలో ప్రతి సమస్యపై స్పందిస్తున్నారు సొంత ధనాన్ని బాధితులకు అందిస్తున్నారు. తమిళనాడు సీఎం ఆయన రాష్ట్రంలో తుఫాన్ దెబ్బతిన్న ప్రాంతాల్లో గొడుగు చేతపట్టి , ఇంటింటికి తిరిగి బాధితులను ఓదార్చి, వారికి సాయం అందిచి,  భరోసా కల్పించారని. పక్క తమిళ రాష్ట్రంలో ఇంత నీతివంతమైన పాలన కొనసాగిస్తుంటే , మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సైక్లోన్ తాకిడికి కొన్ని జిల్లాలు కొట్టుకుపోతే , అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి , ప్రజల కష్టాలను.. అధికారుల నెత్తిన రుద్దారేగాని క్షేత్రస్థాయిలో సీఎం జగన్ స్పందించ కపోవడం , నమ్మి ఓట్లు వేసిన , ప్రజానీకానికి ఇది నమ్మకద్రోహం అని జనసేన పార్టీ పీఏసీ. సభ్యులు ..నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రెస్క్లబ్లో గురువారం మీడియాతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, ఆ పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ . 70 ఏళ్ల వయసు సమీపిస్తున్న స్టాలిన్ తుఫాన్ బాధితులను ఆదుకునే వేగం ,ఉత్సాహం 50 లోపు ఏజ్ ఉన్న మన సీఎం జగన్ లో లేక పోయిందని విమర్శించారు. వర్క్ ఫ్రం హోం . కొంప ముంచిందని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా స్పాట్లో పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే భారీ నష్టం సంభవించి , వ్యవసాయ రైతులు , పాడిపశువులను పంటలను కోట్లల్లో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.