నటుడిగా నాకు మా నాన్నే ఆదర్శం – దుల్కర్‌

వరుసగా ప్రేమకథలు చేస్తూ వెళ్లడం వల్ల నా పై ప్రేక్షకుల్లో రొమాంటిక్‌ హీరో అన్న ఇమేజ్‌ పడిపోయింది. దాన్ని బ్రేక్‌ చేయాలన్న ఉద్దేశంతోనే ఇకపై లవ్‌స్టోరీలకు దూరంగా ఉండాలనుకున్నా.  హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ కథ వినిపించాక.. నాకు నో చెప్పాలనిపించలే. ఈ స్క్రిప్ట్‌ నాకంత స్పెషల్‌గా అనిపించింది కచ్చితంగా ఇది నేను చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నా. . ఇదొక క్లాసిక్‌ ప్రేమకథ. ఇందులో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి.   ఈ పదేళ్ల కాలంలో నేనిప్పటి వరకు 30కి పైగా చిత్రాలు చేశా. నిజానికిది చాలా చిన్న సంఖ్యే. నా సమకాలికులు ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేస్తున్నారు. మా నాన్న ఫిల్మోగ్రఫీ చూస్తే.. ఆయన 80ల్లో ఏడాదికి 30కి పైగా చిత్రాలు చేసిన సందర్భాలున్నాయి. అవి తలచుకున్నప్పుడు.. నేనిప్పుడలా చేయలేకపోతున్నా కదా అనిపిస్తుంటుంది. ఈమధ్య కాలంలో ‘పాన్‌ ఇండియా’ అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఆ పదం లేకుండా ఏ ఇంటర్వ్యూ, ఆర్టికల్‌ కనిపించడం లేదు. నిజానికి ఈ పాన్‌ ఇండియా ఐడియా మనకు కొత్తేమీ కాదు. నేను చిన్నప్పటి నుంచి సినిమాలతో ప్రయాణిస్తున్నా. అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌ చిత్రాల్ని అందరం చూశాం. అప్పట్లో మా నాన్న చేసిన చాలా సినిమాలు తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఆడాయి. రజనీకాంత్‌ చేసిన సినిమాలు జపాన్‌ వంటి దేశాల్లోనూ ఆదరణ దక్కించుకున్నా యి. ఇదంతా ఎప్పట్నుంచో జరుగుతున్నదే. ఈ మధ్యే పాన్‌ ఇండియా పదాన్ని ఎందుకు ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమాని సినిమా అంటే చాలు. దానికి అదనంగా ట్యాగ్స్‌ తగిలించాల్సిన అవసరం లేదు. నా కథల ఎంపికలో నాన్న జోక్యం అసలు ఉండదు  నటుడిగా నాకు మా నాన్నే ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం.