ఎన్టీఆర్ 30 కి ముహూర్తం ఫిక్స్?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ (NTR30) సినిమాను ప్రకటించారు. జనతాగ్యారేజ్ తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించే సరికి అభిమానులు చాలా ఎక్జయిటింగ్ గా తాజా అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త తెరపైకి వచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో గ్రాండ్ గా ఈ సినిమా ప్రారంభం కాబోతుంది.

అంతేకాదు రెగ్యులర్ షూటింగ్ కూడా అప్పుడే షురూ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదలైన పోస్టర్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియాభట్ ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా పేరు కూడా వినిపిస్తోంది. మరి కొరటాల ఏ హీరోయిన్ ను ఎన్టీఆర్ మూవీలో తీసుకుంటాడో చూడాలి. హీరోయిన్ ఎవరనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్‌.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన తుది దశ పనులను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టాడు. మరోవైపు టీవీ షో ఎవరు మీలో కోటీశ్వరుడుతో కూడా బిజీగా ఉన్నాడు. మొత్తానికి అభిమానులను ఓ వైపు టీవీ ద్వారా పలుకరిస్తూనే..మరోవైపు వరుస సినిమాలతో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు తారక్‌.