మరో కేంద్రమంత్రితో భేటీ అయిన రఘురామ కృష్ణరాజు.

పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ను కలిసి కోరారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని.. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని రఘురామ తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అటు పోలవరం అంశంతో పాటు తనపై జరిగిన దాడి వివరాలను పేర్కొంటూ రెండు వేర్వేరు లేఖలు కేంద్రమంత్రికి అందజేశారు.