వృద్ధాప్య పింఛన్లు పెంచాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖరాసిన రఘురామ కృష్ణరాజు.

ప్రభుత్వం తనను ఎంతలా తొక్కిపెడుతున్నా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మాత్రం పట్టు విడవకుండా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే తన అక్రమ అరెస్టుకు సంబందించి పలువురు కేంద్ర మంత్రులకు పిర్యాదు చేసిన రఘురామ. తాజాగా వృద్ధాప్య పింఛ‌న్ల‌ను ఈనెల నుంచి రూ.2,750కు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని కావున ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న పింఛ‌ను కూడా క‌లిపి రూ.3 వేలు ఇవ్వాల‌ని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎవరు ఈ లేఖపై వివరణ ఇవ్వలేదు.