పీర్లను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ కోటేరు లక్ష్మి

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు:ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు మొహరం పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎంపీపీ కోటేరు లక్ష్మి పేర్కొన్నారు.వీరు లపాడు మండలం పెద్ద పురం గ్రామంలో మసీదు వద్ద మొహరం పండుగ సందర్భంగా పీర్లులను సందర్శించి ముస్లిం సోదరులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కోటేరు లక్ష్మి మాట్లాడుతూ.మతసామరస్రానికి ప్రతీక మొహరం పండుగని, ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.ముస్లిం పెద్దలతో కలిసి హసేన్ హుస్సేన్ మృత వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.ముస్లిం సోదరులు మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపు కోవాలని, పాడి పంటలతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముస్లిం మైనారిటీ నాయకులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.