అత్యంత కీలకంగా మారిన మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ

మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ మొదలైంది. కరోనా బారినపడ్డ సీఎం ఉద్ధవ్ థాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆయనే సారధ్యం వహిస్తున్నారు. మొత్తం 8 మంది మంత్రులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. కాగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయబోరంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి .మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వేళ బుధవారం సాయంత్రం 5 గంటలకు పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శివసేన ప్రకటించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధికారిక నివాసం ‘వర్ష’లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు శివసేన ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీకి తప్పకుండా హాజరవ్వాలి. లేదంటే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది.     బుధవారం ఉదయం గవర్నర్‌కు స్వల్ప కొవిడ్ లక్షణాలు. ముందస్తు జాగ్రత్తగా ఆయన హాస్పిటల్‌లో చేరారు. కీలకమైన ప్రకటన చేశారు. ఎవరైనా గవర్నర్‌ను సంప్రదించాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలవొచ్చని ఆ రాష్ట్ర రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *