ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్.

కృష్ణాజిల్లా నందిగామ: డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ వైసిపి పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వేల్పుల సునీత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ను మంగళవారం ఆయన స్వగృహంలో కంచికచర్ల సర్పంచ్ వేల్పుల సునీత, మాజీ ఎంపీటీసీ సభ్యులు వేల్పుల శ్రీనివాసరావు కలిసి అరుణ్ కుమార్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ వైసిపి పార్టీయే తన జీవితం అనుకోని పార్టీని బలోపేతం చేసి 2019 ఎన్నికలలో గెలుపుకుకృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడులా అరుణ్ కుమార్ వైసిపి పార్టీని గ్రామాలలో నాయకులు, కార్యకర్తలతో కలిసి వైసిపిపార్టీ అభివృద్ధికి కృషి చేసి పార్టీ గెలుపు లో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. నందిగామలో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేశారన్నారు. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ వైసిపి పార్టీకి చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం నందిగామ నియోజకవర్గం లోని వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో అరుణ్ కుమార్ మరెన్నో ఉన్నతపదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని తెలిపారు.