డప్పు కళాకారులకు పనిముట్లు అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణాజిల్లా నందిగామ: కళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని నందిగామ శాసనసభ్యులు డా జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.  నందిగామ  పట్టణంలో ని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం లబ్ధిదారు లైన డప్పు కళాకారులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రభుత్వం అందజేసిన పనిముట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డప్పు కళాకారుల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని , అందులో భాగంగానే వారికి పింఛన్లను మంజూరు చేయడంతో పాటు వారు కోరిన విధంగా అవసరమైన పనిముట్లు డప్పులు , గజ్జలు, ఏకరీతి వస్త్రాలను మరియు ఇతర పనిముట్లను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. సమాజంలోని బడుగు బలహీన వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ,పార్టీ నాయకులు నానయ్య ,కళాకారుల సంక్షేమ బోర్డు అధికారులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.