ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థత
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పంజాబ్ లో ఉన్న సమయంలో ఒక్క సారిగా అనారోగ్యానికి గురయ్యారు. వంశీ పోయిన సంవత్సరం హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB)లో సీటు సాధించారు. అందులో భాగంగా ఆయన (AMPPP) కోర్సు చేస్తున్నారు. మంగళవారం కూడా ఆయన క్లాస్ కు హాజరయ్యారు. కానీ ఒక్క సారిగా ఆయనకు లెఫ్ట్ హ్యాండ్ లాగినట్టు అనిపించింది. దీంతో వెంటనే దగ్గరలో ఉన్న ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అక్కడ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడే ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఎవరూ ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు నిర్ధారించారు.