ఎమ్మెల్యే రేగా కాంతారావుకు పేద కుటుంబాలను పరామర్శించే తీరిక లేకపోయింది- బి యస్ పి జిల్లా కార్యదర్శి కె వి రమణ

బూర్గంపహాడ్ మండల కేంద్రం పాండవ బస్తీ లో మేక వెంకట నరసయ్య(43 ) అనే పేద రైతు కుటుంబాన్ని బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి కె వి రమణ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేక వెంకట నరసయ్య గోదావరి వరద కారణంగ జరిగిన పడవ ప్రమాదంలో ఆయన మరణించి నేటికీ 20 రోజులు కావోస్తావున్నది . స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధిత కుటుంబాన్ని వచ్చి పరామర్శించకపోవడం శోచనీయం. నియోజకవర్గంలో గతంలో అగ్రవర్ణాల కుటుంబంలో ఇటువంటి విషాదకర సంఘటనలు జరిగిన వెను వెంటనే క్షణం ఆలస్యం లేకుండా స్పందించి స్వయంగా పరామర్శిం చే ఆ ఎమ్మెల్యే ఎస్సీ,ఎస్టీ,బీసీ పేద కుటుంబాలలో మాత్రం ఏదైనా విషాదకర సంఘటనలు జరిగితే కనీసం తిరిగి చూడకపోవడం అత్యంత గర్హనీయం. ఎమ్మెల్యే రేగా కాంతారావు ని గెలిపించుటలో ముఖ్య భూమిక పోషించిన ఎస్సీ కులస్తులను ఈ విధంగా చిన్న చూపు చూడడం వారిని అవమానించడమే అవుతుందన్నా రు. ఈ సంఘటనతొ ఎస్సీ కుటుంబాలపై రేగా కాంతారావుకి గల ద్వంద వైఖరిని తెలియజేస్తున్నది భవిష్యత్తులో ఈ విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.