నాగాయలంక చేరుకుని పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే.

నాగాయలంకలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ర్యాపిడ్ టెస్టులో కరోనా వైరస్ పాజిటివ్ గుర్తించిన నేపధ్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు హుటాహుటిన శుక్రవారం రాత్రి నాగాయలంక చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఆ కుటుంబంతో ప్రైమరి కాంట్రాక్టు వ్యక్తులను గుర్తించి వారికి కూడా టెస్టు లు చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.దుకాణం నివాసిత ప్రాంతాల్లో కంప్లీట్ శానిటైజేషన్ పనులు ఉదయానికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.దుకాణం ఉన్న ప్రాంతం, 7వవార్డులోని వారి నివాస పరిసరాలను ఆయన అవనిగడ్డ సీఐ బీ.భీమేశ్వర్ రవికుమార్, ఈవోపీఆర్డీ పీ శైలజాకుమారి లతో కలసి పరిస్థితిని సమీక్షించి శానిటేషన్ చర్యలు ప్రారంభించారు.ఎంపీడీవో పీ.శ్రీనివాసరావు ఎస్ ఐ చల్లా కృష్ణ, పంచాయతీ ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.