ఘనంగా ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు జన్మదిన వేడుకలు

కృష్ణాజిల్లా నందిగామ: ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి వేద పండితులు, మత పెద్దలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావును ఆశీర్వదించారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో కలిసి గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ తన తల్లి గారైన కస్తాల మరియమ్మ సూచన మేరకుప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని, రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి నాపై ఎనలేని ప్రేమాఅభిమానాలు చూపిస్తున్న నందిగామ ప్రజలకు ,పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నటికీ రుణపడి ఉంటారని తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశంతో, నందిగామ ప్రాంత ప్రజల ఆశీర్వచనాలతో, పార్టీ నాయకులు కార్యకర్తల కృషితో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని,నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా ఎనలేని కృషి చేస్తాననితెలిపారు. నాయకులు ,కార్యకర్తలు, అభిమానుల మధ్య తన సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, అధికారులు, వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు ,మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినవారిని పేరు పేరునా పలకరిస్తూ అందరికీ మిఠాయిలు అందజేశారు.