మద్యం మాఫీయాపై ఉక్కుపాదం మోపండి యానాం ఎస్పీ వెల్లట్ కు ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఆదేశాలు.

యానాం ప్రాంతంలో మద్యం చౌకగా లభిస్తుండటంతో దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది మాఫియా తయారయ్యి మద్యాన్ని తరలిస్తున్నారని అటువంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన యానాం ఎస్పీ రాజశంకర్ వెల్లట్ తో పుదుచ్చేరి నుంచి #ఫోన్ లో మాట్లాడారు.
ప్రశాంతంగా ఉండే యానాంలో మద్యం మాఫియా వంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని స్పష్టం చేశారు.
మద్యంను తరలిస్తున్నవారి పైన, వారికి సహకరిస్తున కొందరు వ్యాపారులపైనా తక్షణం పోలీసు కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా అందరూ మద్యం మాఫియా నిర్మూలనకు సహకరించాలని అదేవిధంగా వీటి జోలికి వెళ్లకుండా యువత చెడుదోవపట్టకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.