ఫీవర్ సర్వే పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ జె.నివాస్

కృష్ణాజిల్లా నందిగామ: కంచికచర్ల పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో ఫీవర్ సర్వే పై శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్,ఎమ్మెల్యే డా జగన్ మోహన్ రావు మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ,అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు లేదా ఆశా వర్కర్లతో ఫీవర్ సర్వే నిర్వహించడం ,వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ,ప్రతిరోజు టెస్టులు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారని ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెకండ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రత్యేక పర్యవేక్షణ చేశారన్నారు. అధికారులందరూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని ,ఫీవర్ సర్వే లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపేక్షించేది లేదని ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ,ఎంపీడీవో మరియు అధికారులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.