కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి

గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా 38 మంది కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో తుక్కుగూడ మున్సిపాలిటీకి అధిక ప్రాధాన్యమిస్తున్న మంత్రివర్యులు సబితమ్మగారికి చైర్మన్‌ కాంటేకార్ మధుమోహన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రిగారితోపాటు చైర్మన్‌ కాంటేకార్ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌ గౌడ్‌, బాదావత్‌ రవి నాయక్‌, రెడ్డిగళ్ల సుమన్‌, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్‌, బోధ యాదగిరిరెడ్డి, జాపాల భావనా సుధాకర్‌, బాకీ విలాస్‌, రాజమోని రాజు, కొప్పుల పద్మ శివయ్య, ఎమ్మార్వో జ్యోతి, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, ఇతర ప్రజాప్రతి నిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.