రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు చాదర్ సమర్పించిన మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిసారిగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు మాలగుండ్ల శంకర నారాయణ గారు పట్టు చాదర్ సమర్పించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ గారు, భక్తులు,ఫకీర్లు,పీఠాధిపతి తాజ్ బాబా గారు, ఇతర ముఖ్యలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి పట్టుచాదర్ ను స్థానిక బాబయ్య స్వామిదర్గాలో మంత్రి వర్యులు సమర్పించారు. అనంతరం దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ, మతసామరస్యానికి ప్రతీకగా దక్షిణ భారతదేశంలోనే పెనుకొండలోని బాబయ్య స్వామి దర్గా ప్రసిద్ధి చెందిందని మంత్రి తెలిపారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమాన్వితుడుగా పేరుగాంచిన బాబయ్య స్వామి దర్గా వేడుకలను తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ దర్గాను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల కోసం సకల సౌకర్యాలతో అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.ఆ పనులను కూడా వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా పెనుకొండ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రప్రభుత్వం తరపున బాబయ్య స్వామి దర్గా వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. బాబయ్య స్వామి దర్గా వద్ద ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో భక్తులు, ఫకీర్లు,పీఠాధిపతి, మంత్రి గారి సోదరులు శ్రీ మాలగుండ్ల రవీంద్ర గారు, శ్రీ మాలగుండ్ల మల్లికార్జున గారు ఇతర ముఖ్యలతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాబయ్య స్వామి దర్గాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించడం పై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పీఠాధిపతి తాజ్ బాబా గారు, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ గారు, మంత్రి గారి సోదరులు శ్రీ మాలగుండ్ల రవీంద్ర గారు, శ్రీ మాలగుండ్ల మల్లికార్జున గారు, స్థానిక పెనుకొండ నగర పంచాయతీ ఛైర్మన్ పి. ఉమర్ ఫరూక్, జడ్పీటీసీ గుట్టురు శ్రీరాములు, జడ్పీ కోఆప్షన్ మెంబెర్ బాషా, ఎంపిపి గీతా రామ్మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ నగలూరు బాబు, నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ బోయ సునీల్, కౌన్సిలర్లు మొహమ్మద్ తొయ్యిబ్, సబినా యసీన్, బోయ హరిత బాబు, నగరత్న గణేష్, లావణ్య కిరణ్, సద్దాం హుస్సేన్, రఘునాథరెడ్డి, సుధాకర్ రెడ్డి, రమంజి, సంజీవమ్మా మారుతి, భాస్కర్ నాయక్, ఎంపీటీసీలు, దుద్దేబండ సర్పంచ్ గౌతమి శ్రీకాంత్ రెడ్డి, వైశాలి జయశంకర్ రెడ్డి, ఫారీడ్, ఫకీర్లు, వైస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.