సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటన

సంగారెడ్డి జిల్లా లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో కరోనా వ్యాధి పై ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా చికిత్స పొందుతున్న వారికి ఫోన్ చేసి ఆరోగ్యం, కరోనా చికిత్స అందిస్తున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.