ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి బాలినేని..

ప్రకాశంజిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడవ జిల్లా మహిళల అంతర్గత ఫుట్ బాల్ టోర్నమెంటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల ఫుట్ బాల్ గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు వైఎస్సార్సీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, సంతనూతలపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ దుంపా చెంచిరెడ్డిలు ప్రారంభించారు. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల మహిళల జట్లు ఈ టోర్నమెంటులో పాల్గొన్నాయి. మొదటగా ప్రకాశంజిల్లా శ్రీకాకుళం జిల్లా జట్ల మధ్యన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 1-0 స్కోరు తేడాతో శ్రీకాకుళం జట్టు ప్రకాశంజిల్లాపై విజయం సాధించింది.

ఈ జిల్లాల మహిళా క్రీడాకారులను బాలినేని ప్రణీత్ రెడ్డి, దుంపా చెంచిరెడ్డిలు పరిచయం చేసుకున్నారు. ఈ టోర్నమెంటుకు శ్రీకాకుళంజిల్లాకు చెందిన ఫుట్ బాల్ కోచ్ విజయలక్ష్మి రిఫరీగా వ్యవహరించారు. ఇంకా కార్యక్రమంలో మైనంపాడు గ్రామ సర్పంచ్ దాట్ల రమణ, ఫుట్ బాల్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కాకుమాను సునీల్ రాజు, ప్రకాశంజిల్లా మహిళల ఫుట్ బాల్ కమిటీ జిల్లా అధ్యక్షులు పల్లెపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి. ప్రసన్న కుమార్, ఫుట్ బాల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రల ఆధ్వర్యంలో ఈ టోర్నమెంటును నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, పీడీ ఎస్వీఎస్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గొడుగు మస్తాన్, గుండవరపు సుబ్బారావు, పెరుగు సుబ్బారావులు పాల్గొన్నారు.