ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీటీసీ ,జడ్పిటిసి సభ్యులు

కృష్ణాజిల్లా నందిగామ: స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురా వాలని డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సూచించారు. మండల పరిషత్ ఎన్నికల్లో  గెలుపొందిన ఎంపీటీసీ , జెడ్పీటీసీ సభ్యులు శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని సోమవారం నందిగామ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ,తమకు టికెట్ కేటాయించి గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భం గా  ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు మండల పరిషత్ ఎన్నికల ఫలితాలే ప్రజలు ఇచ్చిన తీర్పని తెలిపారు.అభివృద్ధి -సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని తెలిపారు. మండల పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులు బాధ్యతతో పని చేస్తూ ప్రభుత్వానికి- ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుపొందిన అభ్యర్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనాయ కులు , కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *