అదరగొట్టిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్

మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్.  మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  పోస్టర్‌లో చిరంజీవి అదగరొట్టేశాడు. కుర్చీలో కూర్చున్న తీరు, రాజసం ఉట్టి పడుతోన్న విధానం అదిరిపోయింది. ఇక గాడ్ ఫాదర్ టైటిల్ అనేది చిరంజీవికి యాప్ట్ అన్న సంగతి ఈ పోస్టర్‌తో మరోసారి ఫ్రూవ్ అయింది.