పవన్ కళ్యాణ్-రానా సినిమాలో నటిస్తున్న మెగా దర్శకుడు..

ఒకవైపు దర్శకుడిగా సత్తా చాటుతూనే అప్పుడప్పుడూ తెరపై మెరిసే దర్శకుడు వివి వినాయక్ తాజాగా మరోసారి తెరపై మెరవనున్నారు. పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో వినాయక్ నటిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆయనపై షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. తాను దర్శకత్వం వహించిన ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో పాటు పూరి దర్శకత్వం వహించిన నేనింతే సినిమాలో నటించి మెప్పించారు ఈ మెగా దర్శకుడు.