ప్రగతి భవన్ లో కేసీఆర్ మంత్రులతో సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పాలన, పార్టీ పటిష్టంపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్‌ లో టీఆర్‌ఎస్‌ మంత్రులతో… అత్య వసర సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే అందరూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి భవన్‌ లో ఈ సమావేశం జరుగనుంది. ఇక ఈ కీలక సమావేశం లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చ నిర్వహించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం కూడా కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు ఉండటం తో… ఈ సమావేశం నిర్వహించ నున్నారు. అగ్ర కులాల వారికి పదవులు ఇస్తున్నారనే ప్రచారం సాగుతుండటంతో.. దానిపై కూడా ఇవాళ చర్చించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సమావేశం లో కొంత  మంది నేతలకు కేసీఆర్‌ షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.