వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఎండిఓ

కృష్ణాజిల్లా నందిగామ: పలు గ్రామాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులకు ఎండిఓ శిల్ప నోటిఫికేషన్ జారీ చేశారు. కంచికచర్ల మండలంలోని పలు గ్రామాలలో సచివాలయం ద్వారా వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ ద్వారా 14-09-2021 నుండి 17-09-2021 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎండిఓ శిల్ప మండలంలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల వివరాలు తెలుపుతూ కంచికచర్ల-5, పరిటాల-2, గండేపల్లి-1, మున్నలూరు-1, గొట్టుముక్కల-1, పేరకలపాడు-3, మొగులూరు-3, పెండ్యాల-3 గ్రామాల్లో వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గ్రామాలలోని యువతీ యువకులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి శిల్ప సూచించారు.