అమెరికాలో కాల్పుల మోత.. నలుగురికి గాయాలు

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని డల్లాస్‌ పరిధి అర్లింగ్టన్‌లో ఉన్న టింబర్‌వ్యూ పాఠశాలలోని ఒక విద్యార్థి(18) కాల్పులకు దిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 1,900 విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసిందని, ఒక ఉపాధ్యాయుడు సహా ముగ్గురు విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగినట్లు సమాచారం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.